- వర్షాలకు నీట మునిగిన కాలనీ
ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట పెద్ద పేటలో కనీస సౌకర్యాలు కొరవడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పేటలోని రోడ్లు ముంపునకు గురై స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే అధ్వానంగా ఉన్న గ్రామీణ రహదారుల పరిస్థితి వర్షానికి మరింత దిగజారింది. కాలనీలో పక్కా డ్రైన్లు లేకపోవడంతో కచ్చా డ్రైన్లు పూడుకుపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే నిలిచిపోయింది. మురుగునీరు బయటకు పారే మార్గం లేక రహదారులు తరచూ ముంపునకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్‌లు (0)