ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో బుధవారం ఉదయం ఎడతెరిపి లేకుండా సుమారు రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పలు పల్లపు ప్రాంతాలు జలమల్లమయ్యాయి. పలు కాలనీలో రోడ్లు ముంపునకు గురి అయ్యాయి స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో పక్కా డ్రైన్లు లేకపోవడంతో కచ్చా డ్రైన్లు పూడుకుపోవడంతో మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోయింది. దీంతో ఆచంట కచేరి సెంటర్లో ఉన్న ఆర్ అండ్ బి ప్రధాన్ రహదారి నీట మునిగింది. ఈ తరహాలో ప్రయాణికులు వాహనదారులు పలు ఇబ్బందులకు గురయ్యారు.
భారీ వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)