ప్రజాశక్తి ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : కార్మికులు, రైతాంగం, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఈ నెల పదో తేదీన జరుగునున్న జైల్ భరో నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ ... శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పాలమూరు గ్రామంలో నియోజవర్గ స్థాయిలో రైతు, కౌలు రైతు , వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాలన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల హరే రామ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మండిపడ్డారు, కౌలు రైతులకు పంట రుణాలు అందించేందుకు నిజాయితీతో కృషి చేయడం లేదని వాపోయారు. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంట రుణాలు ఇవ్వాలన్నారు. దళితులకు స్మశానవాటికులకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించాలని కనీస వేతనం 700 ఇవ్వాలని అన్నారు. కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. అసంఘటితరంగా కార్మికులందరికీ సమగ్ర చట్టం చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తల పాల్గొన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోటార్ సైకిల్ ర్యాలీ
07 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 10:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)