కోమర్రు డికేవల్లిలో స్థానికులకు అవగాహన
ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : కుష్టు వ్యాధి పట్ల జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్య భద్రతను కాపాడుకోవాలని కాశిపాడు ఆరోగ్య సహయకులు నామాలరాజు అన్నారు. సోమవారం కోమర్రు డికే వల్లిగ్రామాల్లో స్థానికులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరం పై రాగిరంగు మచ్చలు స్పర్శ లేని మచ్చలు కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండటం కనురెప్పలు మూత పడకపోవటం వంటి లక్షణాలు ఉంటే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో హైస్కూలు హెచ్చ్ ఎంఎన్ వెంకటేశ్వర్లు ఎం ఎల్ హెచ్ పి పి ప్రధీఫ్ ఉపాద్యాయులు జి ఆంజనేయులు లక్ష్మీ సరోజని సత్యనారాయణ హైమావతి ఏ ఎన్ ఎం లక్ష్మీ ప్రసన్న ఆషాలు లలిత లలిత కుమారి లావణ్య స్తానికులు పాల్గొన్నారు







కామెంట్‌లు (0)