ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: సీపీఎం మండల కమిటీ సభ్యుడు, వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా నేత మరపట్ల చిన్న దానయ్య (65) బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో పెంటపాడు మండలం యానాలపల్లిలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని సీపీఎం, రైతు, వ్యవసాయ కార్మిక, సీఐటీయూ నాయకులు సిరపరపు రంగారావు, కర్రి నాగేశ్వరరావు, చిర్ల పుల్లారెడ్డి, కండెల్లి సోమరాజు, కరెడ్ల రామకృష్ణ తదితరులు సందర్శించి, ఎర్రజెండాను కప్పి నివాళులర్పించారు.
పోరాటాలకు తీరని లోటు: సీపీఎం నేతలు
1987లో సీఐటీయూ జట్టు కార్మికుడిగా ప్రస్థానం ప్రారంభించిన చిన్న దానయ్య పేదలు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం, ఉపాధి హామీ, ఇళ్ల స్థలాల సాధన కోసం అలుపెరగని పోరాటాలు చేశారని నేతలు గుర్తుచేసుకున్నారు. వార్డు సభ్యుడిగా, గ్రామ శాఖ కార్యదర్శిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని, ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. చిన్న దానయ్య మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవ్వాది శ్రీను, అల్లు సుబ్బారావు, సత్తి కోదండరామిరెడ్డి, బర్ల బాలాజీ, శిద్దిరెడ్డి శేషుబాబు, సతీష్, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)