సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి

3 రోజుల క్రితం

tet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 12:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మార్కులు ఉత్తీర్ణత తగ్గించాలి

- సబ్జెక్టు ఉపాధ్యాయులకు సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలి

- డిఆర్ఓ , డిఈఓ కు వినతి పత్రాలు అందజేసిన యుటిఎఫ్ నేతలు

ప్రజాశక్తి-భీమవరం : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడంతో పాటు ఉత్తీర్ణత మార్కులు తగ్గించాలని, సబ్జెక్టు ఉపాధ్యాయులకు సబ్జెక్టులోనే టెట్ పరీక్ష నిర్వహించాలని యుటిఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను పూర్తిగా మినహాయించాలని తదితర డిమాండ్లలో భాగంగా భీమవరం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి పి ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఓవిఎస్ అనిల్ కుమార్ కు యుటిఎఫ్ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్ విజయరామరాజు పోలిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇస్తూ విద్యాహక్కు చట్టం సవరణ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షల పాస్ మార్కులు తగ్గించాలన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షలు ఆఫ్ లైన్ లో నిర్వహించాలని పేర్కొన్నారు. సబ్జెక్టు టీచర్లకు సంబంధిత సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలన్నారు. ఈ సమస్యలపై ఈనెల 14వ తేదీన విద్యాశాఖ కమిషనర్, మంత్రులకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోతే 18వ తేదీన భవిష్యత్తు కార్య చరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ పట్టాభిరామయ్య జిల్లా కార్యదర్శి జి రామకృష్ణంరాజు, కే శ్రీ రామకృష్ణ ప్రసాద్ , సిహెచ్ కుమార్ బాబ్జి ,మండల పట్టణ శాఖల బాధ్యులు కే త్రిమూర్తులు కేవీ మల్లేశ్వర రావు ,బిఆర్ఎంకే స్వామి, హెచ్ బి నాగబాబు, వి ఎస్ పి శ్రీనివాస్ , పివి రమణ రాజు, ఎం శివరామరాజు, ఏ స్వామి అయ్యప్ప, జి సుధాకర్ , కే సూర్య , ఈ సురేష్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్