ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు వద్ద వశిష్ట గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో శనివారం మధ్యాహ్నానికి నీటిమట్టం రెండు అడుగులు పెరిగింది. మరో ఒకటి, రెండు రోజుల పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉండటంతో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి మరో ఆరు అడుగుల మేర నీటిమట్టం పెరిగితే లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు, ఆచంట ఇన్‌చార్జి ఎస్‌ఐ కే. స్వామి ఆధ్వర్యంలో కోడేరు పుష్కర ఘాట్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కుమార్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
వశిష్ట గోదావరిలో నెమ్మదిగా పెరుగుతున్న వరద
01 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)