- ఇక జీవితాన్ని ఆస్వాదించాలి
లిస్బన్: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ తర్వాతి జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 25 ఏళ్ల కెరీర్‌లో ఎంతో త్యాగం చేశానని, ఇక తన కుటుంబంతో కలిసి సాధించిన విజయాలను ఆస్వాదించాలని ఉందని పేర్కొన్నాడు. తన వివాహానికి ముందు ‘వోగ్’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రొనాల్డో రిటైర్మెంట్‌పై సంకేతాలు ఇచ్చాడు. “బహుశా ఇదే నా ఫుట్‌బాల్ కెరీర్‌లో చివరి సంవత్సరం కావచ్చు. గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లాలనుకుంటున్నా” అని 41 ఏళ్ల రొనాల్డో చెప్పాడు. ప్రొఫెషనల్ కెరీర్‌లో 1,000 గోల్స్ పూర్తి చేసి చరిత్ర సృష్టించాలన్న లక్ష్యంతో ఉన్న రొనాల్డో ప్రస్తుతం 976 గోల్స్ వద్ద ఉన్నాడు. తన సీనియర్ కెరీర్‌లో 24వ సీజన్‌లోకి అడుగుపెట్టిన అతడు.. ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్ క్లబ్ అల్-నస్ర్ తరఫున ఆడుతున్నాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ తర్వాతి జీవితంపై కూడా రొనాల్డో తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఎక్కువగా ప్రయాణాలు చేయడం, పాడిల్ ఆడటం, కుటుంబంతో సమయం గడపడం, ఆటలను వీక్షించడం వంటి వాటిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపాడు. “25 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేశాం. ఇప్పుడు నేను, నా కుటుంబం సాధించిన విజయాలను ఆస్వాదించాల్సిన సమయం వచ్చింది” అని రొనాల్డో పేర్కొన్నాడు. రొనాల్డో రిటైర్మెంట్‌పై చేసిన వ్యాఖ్యలు ఫుట్‌బాల్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, 1,000 గోల్స్ మైలురాయిని చేరుకున్న తర్వాతే రొనాల్డో వీడ్కోలు పలుకుతాడా? అన్నది అభిమానుల్లో ఇప్పుడు ఉత్కంఠగా మారింది.








కామెంట్‌లు (0)