సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈ-రిక్షా బ్యాటరీ పేలి గోదాములో మంటలు

1 గంట క్రితం

fire accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 10:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇద్దరు మృతి

న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్‌ నగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ-రిక్షా బ్యాటరీ పేలడంతో గోదాములో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ మైనర్‌తో సహా ఇద్దరు మృతి చెందారు. మోతీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మసీద్‌ గురుద్వారా రోడ్‌లో ఉన్న ఆర్‌-17ఏ ప్రాంతం నుంచి ఉదయం 4.42 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే మూడు ఫైర్‌ టెండర్లు, ఓ వాటర్‌ బౌజర్‌ను ఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు నాలుగు అంతస్తులు ఉన్న భవనంలోని మొదటి అంతస్తులో గృహోపకరణాల మధ్య మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ-రిక్షా బ్యాటరీలో పేలుడు సంభవించడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 17 ఏళ్ల సుఫైద్‌, 38 ఏళ్ల మహ్మద్‌ సమీద్‌ను రఘుబీర్‌ నగర్‌లోని గురు గోవింద్‌ సింగ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలు, పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్