- ఫ్యాప్టో
ప్రజాశక్తి-భీమవరం : జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్ ను ఫ్యాఫ్ట్టో నేతలు కోరారు. స్థానిక కలెక్టరేట్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఈఓ ను ఫ్యాఫ్ట్టో నేతలు మర్యాదపూర్వకంగా కలిసిన పుష్పగుత్యం అందజేసే అభినందనలు తెలియజేశారు. ఫ్యాఫ్ట్టో జిల్లా ఛైర్మన్ పి.ఎస్.విజయరామరాజు, సెక్రెటరీ జనరల్ జి.ప్రకాశం మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, ఉపాధ్యాయ సంఘాలకి సహకరించాలని కోరారు. పెండింగ్ లో వున్న ఉపాధ్యాయ సమస్యలు, ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలన్నారు.అపరిష్కృతంగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. కో చైర్మన్స్ సాయి వర్మ, వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ క్రాంతి కుమార్, రామచంద్రరావు, రమణ, కోశాధికారి పట్టాభి రామయ్య పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)