- గ్రామస్తులకు న్యాయం చేయాలి
ప్రజాశక్తి గోపాలపురం: నకిలీ డి ఫారం పట్టా సృష్టించి స్మశాన వాటిక భూమిను ఆక్రమించుకున్న వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని...ఆ స్మశాన వాటిక భూమిని తిరిగి గ్రామస్తులకు అప్పగించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు కోరారు. మంగళవారం దొడ్డిగర్ల సువర్ణరాజు, సాగిపాడు గ్రామస్తులు స్థానిక తహశీల్దార్ జి.మహాలక్ష్మిను తహశీల్దార్ కార్యాలయంలో కలిశారు. స్మశాన వాటిక భూమిను ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని ఆ భూమిని సాగిపాడు గ్రామస్తులుకు అప్పగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సువర్ణ రాజు మాట్లాడుతూ మండలంలోని సాగిపాడు గ్రామానికి చెందిన సర్వే నెం. 79/1 లోని 3.96 ఎకరాల భూమి గలదు అని తెలిపారు. తణుకు వేములయ్య అను వ్యక్తి ఒక ఫేక్ డి ఫారం పట్టా" సంపాదించి గత 7సం.ల నుండి ఆ గ్రామ ప్రజలను, పోలీసు డిపార్ట్ మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్ మెంట్ వారిని, పంచాయతీ శాఖ వారిని ఇబ్బందులు పెడుతూ, అన్యాయముగా ఆక్రమించుటయే గాక కోర్టుల చుట్టూ ప్రజలను తిప్పుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తున్న తణుకు వేములయ్యపై చట్టరిత్యా కేసు నమోదు గూర్చి పోలీసు డిపార్ట్ మెంట్ వారికి సిఫార్సు చేసి ఆ గ్రామ ప్రజలకు న్యాయము చెయ్యాలని తహశీల్దార్ ను కోరారు. చనిపోయిన వారిని దహనపరిచేందుకు, ఖననము చేయడానికి ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కారముపై శ్రద్ధ పెట్టి మీపై అధికారులను సంప్రదించి గ్రామ ప్రజల స్మశాన వాటికకు త్వరలోనే మోక్షము ప్రసాదిస్తారని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నమని సాగిపాడు గ్రామ ప్రజలు తెలిపారు. దీనిపై డివిజన్ స్థాయి, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ మెసేజ్లు మాత్రమే వస్తున్నాయని ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గణపతి, సాగిపాడు గ్రామస్తులు నారాయణ రాజు గ, నరసింహమూర్తి , సత్తి బాబు , శ్రీను, వెంకటేశు ,వీరస్వామి, జన సేన పార్టీ శ్రేణులు నాగేంద్ర, బాలు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)