- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు
- విశాఖపట్నంలో లారీ డ్రైవర్ పై ఆర్టీవో దాడిని ఖండిస్తూ భీమవరంలో నిరసన
ప్రజాశక్తి-భీమవరం : విశాఖపట్నంలో లారీ డ్రైవర్ పై ఆర్ టి ఓ దాడి చేయడం హేయమైన చర్యఅని ఆర్టీవోను విధులనుంచి తొలగించి కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు డిమాండ్ చేశారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ఆక్వా అనుబంధ పరిశ్రమల వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్ ఆర్టీవో దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ డ్రైవర్ కి మెరుగైన వైద్యం అందించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కొట్టే అధికారం ఆర్టిఓ అధికారులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఆక్వా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్లు చాలిచాలని వేతనాలతో అదనపు పని భారత్తో ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారన్నారు. విశాఖపట్నంలో లారీ డ్రైవర్ పై జరిగిన దాడిని అందరు ఖండించాలని కోరారు. ఆక్వా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కోటి మాట్లాడుతూ సమాజంలో ఉత్పత్తిని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి సేవలు అందిస్తున్న డ్రైవర్లపై పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.డ్రైవర్లు తమ విధులను ఒక్కసారి బహిష్కరిస్తే దేశంలో ఉత్పత్తి ఎక్కడికక్కడే స్తంభించిపోస్తదని హెచ్చరించారు. పట్టణ పేదల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఎం వైకుంఠరావు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఇంజేటి శ్రీనివాస్, ఇరింకి నాగరాజు, ఇమ్మానుయేలుబ, దుర్గ ప్రసాద్ , సత్యనారాయణ, డ్రైవర్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)