ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : ఉపిరితిత్తుల కేన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ప్రైమరిహెల్త్ కేర్ ప్రొవైడర్సు వెల్పేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏ ఆర్ కె పరమేశ్వర్లు అన్నారు. ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా శనివారం పి ఎం పి మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో కేన్సర్ పై అవగాహన ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలీ మండల అధ్యక్షులు ఎం.సత్యనారాయణ మూర్తి మీనాక్షి క్లీనిక్ వద్ద నుండి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పరమేశ్వర్లు మాట్లాడుతూ .... ప్రతి ఏడాది ఆగస్టు ఒకటవ తేదిన ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం జరుపుకుంటామని చెప్పారు. కేన్సర్ పై అవగాహన కల్పించి ముందస్తు పరీక్షలకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కేన్సర్ లక్షణాలు సాధారణంగా తగ్గని దగ్గు తుప్పు రంగులో ఉమ్మి వేయటం దగ్గినప్పుడు రక్తం రావటం, ఆయాసం, ఛాతి భుజం లేదా వెన్నునెప్పి బరువు తగ్గటం వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఈ లక్షణాలుకలిగిన వ్యక్తులు స్కానింగ్ ద్వారా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మద్యపానం ధూమపానం గుట్కా పొగాకు వలన కూడా కేన్సర్ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్సి వి శివ శ్రీనివాస్ రావు, కోశాధికారి కొటకల అప్పారావు, ఈసిసబ్యులు మస్తాన్ వల్లి, పానకాలు రావు పాల్గొన్నారు.
ఊపిరితిత్తుల కేన్సర్ పై అవగాహన ఉండాలి
01 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 03:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)