సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అవగాహన ప్రధానం

1 గంట క్రితం

cancer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 03:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

క్యాన్సర్‌ వ్యాధి రావడానికి జన్యు మార్పులు, పొగ తాగడం, అధిక ఆల్కహాల్‌ సేవనం, స్థూలకాయం, పర్యావరణ కాలుష్యం, ప్రమాదకర రసాయనాలతో పని చేయడం, రేడియేషన్‌కు గురికావడం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తీసుకోవడం, శారీరక వ్యాయామం కొరవడడం, నిశ్చల జీవనశైలి, ఆలస్యంగా గుర్తించడం, అవగాహన లోపం, పేదరికం, సూర్యకిరణాల్లో అతినీలలోహిత కిరణాలకు గురి కావడం లాంటివి ముఖ్య కారణాలు. క్యాన్సర్ వ్యాధి రోగ లక్షణాల్లో గడ్డలు లేదా ట్యూమర్లు ఏర్పడడం, బరువు తగ్గడం, రక్తస్రావం కలగడం, అలసట, చర్మ మార్పులు, దగ్గు, మలబద్ధకం, మింగడంలో అసౌకర్యం, గురక, అజీర్ణం, జ్వరం, రక్తహీనత, సంతానోత్పత్తి సమస్యలు, చమట పట్టడం లాంటివి వస్తాయి. క్యాన్సర్ నిర్థారణలో రక్త పరీక్షలు, ఇమేజింగ్‌ పరీక్షలు, ఎండోస్కొపీ లాంటివి వినియోగించబడుతున్నాయి. క్యాన్సర్ చికిత్సలో సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, హార్మోన్‌ థెరపీ, స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ లాంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్‌ రాకుండా పోషకాహారం తీసుకోవడం, తరుచుగా పరీక్షలు చేయించుకోవడం, శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం, పొగాకు ఉత్పత్తులకు చరమగీతం పాడడం, శారీరక వ్యాయామం, టీకాలు తీసుకోవడం, ఇన్‌ఫెక్షన్‌ కాకుండా చూసుకోవడం, చురుకైన దిన చర్య పాటించడం, క్యాన్సర్‌ రిస్కులకు దూరంగా ఉండడం, సూర్యుడి అతినీలలోహిత కిరణాలు సోకకుండా జాగ్రత్త పడడం లాంటివి తప్పనిసరిగా పాటించాలి. మన దేశంలో క్యాన్సర్‌ వ్యాధి 12 శాతం నుంచి 18 శాతం వరకు పెరగడం గమనించారు. పైగా వ్యాధిని ముదిరిన తర్వాత గుర్తించడంతో క్యాన్సర్‌ కారణ మరణాలు అధికంగా నమోదు అవుతున్నాయి. నిరక్షరాస్యత, పేదరికం, పోషకాహార లోపం లాంటి కారణాలతో మన దేశంలో క్యాన్సర్‌ అతిగా ప్రబలుతున్నందున ప్రతి ఒక్కరూ దీని పట్ల అవగాహన కలిగి ఉండడం, అవగాహన కల్పించడం నిరంతరం జరగాలి.


​(22 సెప్టెంబర్ ప్రపంచ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంక్షేమ‌ దినం )

- డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

సెల్‌: 9949700037


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్