ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన వశిష్ట గోదావరి సోమవారం కాస్త శాంతించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు పుష్కర రేవు వద్ద రెండు అడుగుల మేర నీటిమట్టం తగ్గింది. గోదావరి తగ్గుముఖం పట్టడంతో అధికారులతోపాటు లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని కనుగోరుమిల్లి పుష్కర ఘాట్ ఇంకా ముంపు లోనే ఉంది. లంక గ్రామాల రైతులు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కొబ్బరి చెట్లకు దింపులు తీసుకుని పనిలో నిమగ్నమయ్యారు. కొబ్బరికాయలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వైద్య సిబ్బంది తాత్కాలిక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. తాసిల్దార్ కుమార్, వివిధ శాఖల అధికారులు లంక గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
తగ్గుముఖం పట్టిన వశిష్ట గోదావరి
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)