ప్రజాశక్తి-నరసాపురం: మురుసు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో ఒక ఇంటి గోడ కూలిపోయింది. సీతారామపురం సౌత్ రావివారి తోటలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావి నాగ సూర్య చంద్ర రావు అనే వ్యక్తికి చెందిన ఇంటి గోడ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల తాకిడికి నానిపోయి బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
సీతారామపురంలో కూలిన ఇంటి గోడ - తప్పిన ప్రమాదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 10:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)