ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

1426 సర్వే నెంబర్ లో బస్టాండ్,క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలి. - సిపిఎం డిమాండ్

18 గంటల క్రితం

A bus stand and a sports ground should be established in Survey Number 1426 CPMs demand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 03:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అవినీతికి పాల్పడి కబ్జాలకు సహకరిస్తున్న రేవెన్యూ అధికారులు - సిపిఎం విమర్శ


ప్రజాశక్తి - బ్రహ్మంగారి మఠం (కడప) : బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో మల్లె పల్లె మెయిన్ రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలకు 100 గజాలదూరంలో అందుబాటులో ఉన్న సర్వే నంబర్1426,లోని 5 ఎకరాల,66 సెంట్లు ప్రభుత్వ భూమిలో బ్రహ్మంగారి మఠం అభివృద్ధి లో భాగంగా పుణ్యక్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు, యత్రికులకు గ్రామ ప్రజలకు అనుగుణంగా బస్టాండ్, క్రీడా మైదానం, పార్క్ లాంటి ఇతర ప్రజా ఉపయోగ కరమైన వాటిని ఏర్పాటు చేయాలని, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గండి సునిల్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు హరి,రమణమ్మ లతో కలసి వారు మాట్లాడుతూ .. ప్రతి సంవత్సరం ఆరాధన సమయంలో 1426 సర్వే నెంబర్ నందు జిల్లా నలుమూలల నుండే కాక వివిధ రాష్ట్రాలనుండివచ్చే భక్తులు, యత్రికులకు చెందిన మరియు ఆర్టీసీ కి చెందిన వేలాది వాహనాలు పార్కింగ్, రవాణా సౌకర్యం కోసం ఈ ప్రదేశం ఎంతో గాను ఉపయోగకరంగా ఉండేది. నేడు ఆ ప్రభుత్వ స్థలంపై కొంత మంది కన్ను వేయటంతో ఆరాధన సమయంలో ఉపయోగించు కునేందుకు కనిసం 4,కిలో వరకు ఎటువంటి సౌకర్యం లేదని వారు ఆవేదన వెళ్ళబుచ్చారు, గతంలో ఇస్తలాన్నీ బస్ స్టాండ్ కోసం కుడా రెవెన్యూ అధికారులు పరిసిలించడం జరిగిందని, ఇది ప్రభుత్వ స్థలమని బోర్డుకూడా వేయటం జరిగిందని, కోర్టులో కుడా వాజ్యం నడుస్తుందని ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయని వారు ప్రశ్నించారు, రెవెన్యూ కార్యలయానికి కేవలం 100 గజాల దూరంలో అక్రమణ జరుగుతువుంటే తహసీల్దార్ ఏమి చేస్తున్నారని, బి. మఠం మండల తహసిల్దార్ వారు ఆక్రమణ దారుల నుండి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే తమ ఆఫీసు ఎదురుగా కోట్లరుపాయల ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతువున్న పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేసి గందర గోలపర్చి ఇస్టాను సారంగా వ్యవహరిస్తూ అక్రమణదారులకు సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే మండల తాహసిల్దార్ వారు స్పందించి 1426 సర్వే నెంబర్లు జరుగుతున్న కట్టడాలను ఆపకపోతే సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు రెవిన్యూ వారే బాధ్యత వహించవలసి ఉంటుందని వారు హెచ్చరించారు.
A bus stand and a sports ground should be established in Survey Number 1426 CPMs demand


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్