మాజీ ఎమ్మెల్యే ఎస్ రఘురామి రెడ్డి
ప్రజాశక్తి -మైదుకూరు (కడప) : చాపాడు మండలం పెద్ద గురువలూరు నామినేషన్ కేంద్రం ఆర్ ఓ గా పనిచేసిన వీరారెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయ ఏఓ కృష్ణకుమారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న గురువులూరు గ్రామానికి చెందిన జంబారపు శాంత స్వరూప్, జాంతన్ లు సర్పంచులుగా నామినేషన్ దాఖలు చేశారన్నారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసినప్పటికీ అర్ధరాత్రి దొంగ సంతకాలతో ఆర్వో సర్పంచుల ఉపసంహరణ చేశారన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉపసంహరణ జరిగి ఉంటే ఆధారాలు ఇవ్వాలన్నారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఆధారాలు ఇవ్వాలని టిడిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నామని ప్రకటించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏఎస్ఐ బాలయ్యకు ఆర్ఓ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధపడుతామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి లక్ష్ముమయ్య, వైసిపి నాయకులు కిషోర్ కుమార్ రెడ్డి, సివి సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వెంకట రెడ్డి, బాల గంగయ్య, జయసుబ్బారెడ్డి,రాజు, గోవర్ధన్ రెడ్డి శివారెడ్డి, గంగులయ్య చంద్ర, వీరారెడ్డి సుధాకర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.








కామెంట్లు (0)