సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత : డీఎస్పీ మురళి నాయక్

1 గంట క్రితం

Adhering to road safety rules is everyone's responsibility: DSP Murali Naik.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పులివెందుల రూరల్ (కడప) : రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి బాధ్యత అని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ అన్నారు. కడపజిల్లా యస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలమేరకు పులివెందుల పట్టణములోని ఆటోడ్రైవర్లు యజమానులకు రోడ్డుభద్రతపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా పులివెందుల డి.యస్.పి మురళి మరియు పులివెందుల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ లు రావడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూరోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతిఒక్కరి బాధ్యతని, ప్రతిఒక్కరు రోడ్డునియమాలను తప్పక పాటించాలని లేదా చట్టపరముగా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రజలను ఎక్కించుకొని నడుపరాదని, ఆటోలను వారికి కేటాయించిన ఆటో స్టాండ్ లలో మాత్రమే ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ లు చేయరాదని సూచించారు.ముఖ్యముగా స్కూల్ విదార్థులతో ప్రయాణించు సమయములో అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. మద్యంత్రాగి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని అది మీప్రాణాలకు మరియు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని సూచించారు. ప్రయాణికులు తొందరపాటున ఆటోలో వారివిలువైన ఆభరణములు, డబ్బులు మరచివెళ్ళినచో, వెంటనే ఆటోడ్రైవర్లు వాటిని సంభందిత పోలీస్ స్టేషన్ నందు అప్పగించి నిజాయితీ చాటుకోవాలని సూచించారు.మహిళపట్ల గౌరవముగా ఉండాలని లేనియెడల కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పులివెందుల పట్టణము నిఘానేత్రాల పర్యవేక్ష్యణలో ఉందని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిని వెంటనే గుర్తించి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జీరో ప్రమాదాలే పులివెందుల పోలీసుల లక్ష్యమని దీనిని సాకారం చేయుటకు ప్రతి వాహనచోదకులు మరియు ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే.డ్రంకెన్ డ్రైవింగ్ చేయకూడదు . ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు .ఓవర్ లోడ్ తో ప్రయాణించరాదు..సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు. 5.హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. 6.సీట్ బెల్ట్ ధరించడం .రాంగ్ పార్కింగ్ చేయరాదు. మైనర్ డ్రైవింగ్ చేయరాదు. రాంగ్ రూట్ లో ప్రయాణించరాదు. ప్రయాణికుల నుండి అధిక చార్జీలు వసూలు చేయరాదని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్