28న గంధం.. 29న జండా మహోత్సవం
ప్రజాశక్తి - నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని జండామాని వీధిలో వెలసిన శ్రీశ్రీశ్రీ హజరత్ మహబూబ్ సుభాని దర్గా ఉరుసు కార్యక్రమాలను ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి మౌలానా మౌల్వి సయ్యద్ మొయినుద్దీన్ హుస్సేన్, గవర్నమెంట్ గెజిటెడ్ ఖాజీ, దర్గా వెల్ఫేర్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 28న గంధం కార్యక్రమం, 29న జండా మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్గా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జుల్ఫికర్ మాట్లాడుతూ.. ఉరుసు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజలందరూ తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్. మహమ్మద్ రసూల్, సెక్రటరీ ఉమర్ షరీఫ్, ట్రెజరర్ సయ్యద్ అమీర్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ ఇనాయతుల్లా, ఎగ్జిక్యూటివ్ సభ్యులు షేక్ మౌలా, అబ్దుల్, అడ్వైజరీ కమిటీ సభ్యుడు కలీం, సభ్యులు మహబూబ్ భాష, షేక్ ఫయాజ్, షేక్ షమీ, షేక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్ అస్మా, షేక్ అన్వర్, సయ్యద్ అల్తాఫ్, సయ్యద్ యాసీన్, సయ్యద్ అబ్దుల్, షేక్ జాహిద్, షేక్ కరీముల్లా, గోపి, షేక్ ఇర్ఫాన్, హర్షద్, షఫీ, ఖాలీద్ భాష, నిజాం, నసురు, ఇస్మాయిల్, సయ్యద్ షఫీ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)