ప్రజాశక్తి-కడప అర్బన్ : ఎర్రముక్కపల్లి-విశ్వనాధపురం మధ్య పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయడంలో అధికారుల జాప్యాన్ని నివసిస్తూ డిసెంబర్ 7వ తేదీ కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టినట్లు సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ తెలిపారు. శనివారం నగరంలోని మృత్యుంజయకుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా ఎర్రముక్కపల్లి - విశ్వనాధపురం మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు సీపీఎం, ప్రజలు ఆందోళన చేసిన అధికార యంత్రాంగం సరైన శ్రద్ధ పెట్టడం లేదన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి పెండింగ్లో ఉండడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కడప నగరంలో త్రిబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని, ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎర్రముక్కపల్లి నుంచి విశ్వనాధపురం వైపు దాదాపు 30 గ్రామాల ప్రజలు 50 వేల మంది దాకా నివాసముండే ప్రాంతమని తెలిపారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని, తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం చేయాలని అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించని కారణంగా 7వ తేదీ ఉదయం పది గంటలకు కడప రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాలని సిపిఎం నిర్ణయించిందన్నారు. ఈ ఆందోళనలో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించి పూర్తి చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం నాయకులు రామకృష్ణారెడ్డి, నరసింహ పాల్గొన్నారు.
రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యపై ఆందోళన : సిపిఎం నగర్ కార్యదర్శి రామ మోహన్
20 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 02:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)