శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోడిగాండ్లపల్లెలో కార్డన్ అండ్ సెర్చ్

1 రోజు క్రితం

nca
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు ; కోడిగాండ్లపల్లెలో గురువారం సిఐ నగేష్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.15 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పరిశీలించి వాహనదారులకు అప్పగించారు.అనంతరం రౌడీషీటర్లు రాయపాటి వెంకటరెడ్డి, కొర్రపాటి తిమ్మారెడ్డిలకు సిఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్టవిరుద్దమైన కార్యకలాపాలు, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు.గ్రామంలో అల్లర్లు సృష్టించి గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్గపోరు వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. ఫ్యాక్షన్ వీడి ప్రశాంతంగా జీవించాలని సూచించారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నియమ నిబంధనలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరిగేలా సహకరించాలని సిఐ గ్రామస్తులను కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్