ప్రజాశక్తి - బ్రహ్మంగారిమఠం (కడప) : బ్రహ్మంగారిమఠం మండలం సిపిఎం జడ్పిటిసి అభ్యర్థిగా గండి సునీల్ కుమార్ గురువారం కొత్తూరు గ్రామం నుండి ప్రచారం ప్రారంభించారు. ఒక్క అవకాశం ఇచ్చి సిపిఎం పార్టీని గెలిపించండి. ప్రజలకు సేవ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రచారం కొనసాగించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తూ నేడు మరింత ప్రజాసేవకు అంకితం కావాలనే ఆలోచనతో జడ్పిటిసి అభ్యర్థిగా బరిలో దిగాను మీ అందరి ఆదరణలతో నన్ను జడ్పిటిసిగా గెలిపించాలని ఓటర్లను కోరారు. బ్యాలెట్ పేపర్ లో మొదటి గుర్తు సుత్తి,కొడవలి,నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటరు మహాశయులను కోరారు.
జడ్పిటిసి ప్రచారం ముమ్మరం చేసిన సిపిఎం పార్టీ అభ్యర్థి గండి సునీల్ కుమార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 10:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)