గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి : కమిషనర్ రాహుల్ మీనా

1 గంట క్రితం

Sanitation works must be expedited: Commissioner Rahul Meena
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : నగరంలో పారిశుధ్య చర్యలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గురువారం ఉదయం హైటెక్ బస్టాండ్, డీలక్స్ సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డు సహా పలు ప్రాంతాలలో పర్యటించారు. రోడ్లపై నిలిచిన నీటిని, ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా మోటర్ల సాయంతో తొలగించాలన్నారు. అలాగే వాహనదారులు, పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం లోపు రహదారులపై ఉన్న చెట్ల కొమ్మలు, వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అనంతరం క్వారీ మార్కెట్ లోని వెహికల్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా యార్డులో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, మూవ్ మెంట్ రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రస్తుతం ఎన్ని వాహనాలు వినియోగంలో ఉన్నది.? ఎంత మంది డ్రైవర్లు అందుబాటులో ఉన్నారో.? వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాహనాల కండిషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని.. మరమ్మతులు ఉన్నట్లయితే వెంటనే చేయించి వారం రోజుల్లోగా వాహనాలన్నింటినీ పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం నల్లా ఛానల్, ఎన్ఆర్సీపీ పంపింగ్ స్టేషన్ లను పరిశీలించారు. ఆయన వెంట శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఉన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్