ప్రాథమిక అంచనాలను ఉన్నతాధికారులకు నివేదించిన వ్యవసాయ శాఖ
ప్రజాశక్తి - కపిలేశ్వరపురం (తూర్పు గోదావరి) : బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు మండలంలో సుమారు 16వేల ఎకరాల్లో వరి పంట నేలనంటినట్లు మండల వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పంట నష్టానికి సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు మండల వ్యవసాయ అధికారి బి. రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో నేలవాలిన పంట పొలాలను వివిధ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ రైతులకు తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువల ద్వారా వీలైనంత త్వరగా నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు వివరించారు. తుఫాన్ ప్రభావం తగ్గిన అనంతరం వరి పంటకు పొడ తెగులు, దోమపోటు సోకే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, తయారు అయినా గింజలు 5 శాతం ఉప్పు ద్రావణo పిచికారీ చేయడం ద్వారా వరిగింజ మొలకెత్తకుండా నివారించవచ్చని, లీటరు నీటిలో 50 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయాలన్నారు . పంట పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.








కామెంట్‌లు (0)