చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాలనలో మహిళలు, పిల్లలు, వృద్ధులకు భద్రత కరువైందని డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం విమర్శించారు. తిరుచిరాపల్లి తూర్పు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తూ, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ దాడులతో డీఎంకే కార్యకర్తలను భయపెట్టలేరని స్పష్టం చేశారు. అవినీతిపరులను పార్టీలో చేర్చుకుంటూ, ప్రతిపక్ష నేతలను ఎంపిక చేసి వేధిస్తున్నారని అధికార టీవీకే పార్టీపై మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని స్టాలిన్ విమర్శించారు.
విజయ్ పాలనలో బలహీన వర్గాలకు భద్రత కరువు : స్టాలిన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)