శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సెపక్ తక్రా జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన డిఈఓ

1 గంట క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 04:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : శుక్రవారం స్థానిక విటి అగ్రహారం జెడ్పీ హై స్కూల్ లో జరిగిన జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు ప్రారంబించారు. త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా డిఈఓ మాణిక్యం నాయుడు మాట్లాడుతూ.. విద్యార్థులలో క్రీడలో రాణించిన వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. విద్యలో కూడా ముందు ఉంటారని అన్నారు. గెలుపు, ఓటములు తెలుసుకున్న వారు నిజ జీవితంలో తీసుకునే నిర్ణయాలు, చేసే పని , ఆలోచనా తీరులో విచక్షణ కలిగి ఉంటారన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. బాగా ఆడి రాష్ట్ర పోటీల్లో కూడా విజేతగా నిలిచి జిల్లా ప్రతిష్ఠను పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు,జిల్లా వ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్