ప్రజాశక్తి - నందలూరు : రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు–2026కు సంబంధించి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేసినట్లు నందలూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె ఆర్ ఎం ప్రసాద్ తెలిపారు. ఈ ముసాయిదా జాబితాను మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రజలు సంబంధిత కార్యాలయాల్లో జాబితాను పరిశీలించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల విషయంలో ఏవైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే ఈ నెల 16వ తేదీ లోగా నందలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా సమర్పించాలని కోరారు
పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల
15 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 03:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)