శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అప్పుల బాధతో ఉరేసుకొని రైతు ఆత్మహత్య

3 రోజుల క్రితం

Farmer dies by hanging due to debt burden.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - బ్రహ్మంగారి మఠం (కడప) : అప్పుల బాధతో రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలంలోని జి.నరసింహాపురం గ్రామంలో ఈరోజు చెన్నుబోయిన సుబ్బారాయుడు (45) అనే రైతు రూ.30 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. ఆ అప్పులు ఎలా తీర్చాలో, ముగ్గురు పిల్లలు, భార్యను ఎలా పోషించాలో దిక్కుతోచక తోట వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్