శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లా స్థాయి పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

04 ఆగస్టు, 2026

Government school students for district-level competitions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 10:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజంపేట (కడప) : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ పోటీలలో రైల్వే స్టేషన్ వద్ద గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి జలా స్థాయికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు నాగమణి మంగళవారం తెలిపారు. కబడ్డీ అండర్-17 బాలికల విభాగంలో జ్ఞాన దీపిక, ఉమామహేశ్వరి.. బాలుర విభాగంలో సంతోష్, ప్రతీక్, హేమంత్, యాషిన్, శివ, భాస్కర్ లు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. అండర్-17 ఖోఖో లో భాను ప్రకాష్, వాలీబాల్ కు జాఫర్, కబడ్డీ అండర్-23 విభాగంలో ఎం రాజశేఖర్ లు ఎంపికైనట్లు ఆమె వివరించారు. ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలితోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు జి.ప్రసాద్, టి.ఆనందమ్మ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్