ఖర్చు తక్కువ దిగుబడులు ఎక్కువ - " డిఎమ్ఎమ్ టి,ఎఫ్ ఎమ్ టి నుజహత్ "
ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన ఎరువులతో పంటలు సాగు చేస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ డివిజనల్ మోడల్ మేకర్ ట్రైనీ,ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ నుజహత్ తెలిపారు. ఉమ్మారెడ్డిపల్లె గ్రామంలో శ్రీ బాలాజీ బయో ఇన్ఫ్ ట్, అవుట్ ఫుట్ రిసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఎరువుల దుకాణం ఏర్పాటు చేశారు. నుజహత్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పంటలు సాగు చేస్తే భూమి సారవంతమవుతుందన్నారు. శనివారం యామవరం గ్రామానికి చెందిన రైతు వివేకానందరెడ్డి 30 ఎకరాల పొలానికి అవసరమైన 24 టన్నులు ఘన జీవామృతాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగిందన్నారు.ఘన జీవామృతం తయారీకి 24 టన్నుల ఆవు పేడ,1200 లీటర్ల ఆవు మూత్రం, 500కేజిల శనగపిండి,500 కేజిల బెల్లం పరిమాణంలో ఆవు పేడలో కలిపి ఘన జీవామృతం తయారు చేశామన్నారు.ఆఖరి దుక్కిలో ఘనజీవామృతాన్ని కలపడం వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులను ఉత్తేజపరచి ప్రధాన పంటకు కావలసిన పోషకాలు సూక్ష్మజీవులు వేరు వ్యవస్థ ద్వారా మొక్కకు అందజేస్తుందన్నారు. మొక్క ఎండ బెట్టను తట్టుకొని సారవంతంగా పెరగడానికి ఉపయోగపడుతుందన్నారు.ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించేందుకు రైతులకు అవసరమైన కషాయాలు,ద్రావణాలు,పిఎండిస్ విత్తనాలు మొదలైన ఇన్పుట్స్ అందుబాటులో ఉన్నాయని కేంద్రం నిర్వాహకులు విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సల్మా,అన్వర్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)