ప్రజాశక్తి-రాజంపేట : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన యోగంద్ర కార్యక్రమానికి చమర్తి జగన్ మోహన్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా యోగ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆనందంగా ఉండాలని, యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : చమర్తి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)