ప్రజాశక్తి-మైలవరం (కడప) : మైలవరం జలాశయం ఉత్తర కాలువకు సాగునీరు విడుదల చేయాలని శనివారం రైతులు చేసిన విజ్ఞప్తికి ఇరిగేషన్ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆదివారం ఉదయం మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగునీరు విడుదల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఉత్తర కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిరప, మొక్కజొన్న తదితర పంటలకు నీరు అందడంతో రైతులకు ఎంతో ఊరట లభించిందన్నారు. రైతుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని వెంటనే నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కాలువలో నీరు ప్రవహించడం ప్రారంభం కావడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నీటితో ఎండిపోతున్న పంటలు కొంత మేర గట్టెక్కే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర కాలువకు సాగునీరు విడుదల .. రైతుల్లో ఆనందం
02 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 04:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)