ప్రజాశక్తి - నందలూరు : మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ZPTC) ఎన్నికలు–2026కు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై ప్రజాప్రతినిధులతో సమావేశం బుధవారం నందలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఉదయం 11 గంటలకు జరిగిన ఈ సమావేశానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే.ఆర్.ఎం. ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రాబోయే MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రజల పరిశీలనార్థం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్లు వివరించారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ముసాయిదా జాబితాను పరిశీలించి తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మాల్యాద్రి, ఏవో హబీబుల్లాఖాన్ తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై సమావేశం
16 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)