ప్రజాశక్తి-పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరు సబ్-డివిజన్ పరిధిలోని పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంటఊరు ఇందిరమ్మ కాలనీలో ఈరోజు “ఆపరేషన్ వజ్రప్రహార్” కార్యక్రమంలో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది పలమనేరు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. మోహన్ రెడ్డి, గంగవరం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామ్ భూపాల్, పలమనేరు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పరశురామ్, పలమనేరు సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. రాజశేఖర్, పోలీసు సిబ్బంది – 54 మంది ఈ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 250 ఇళ్లను తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా 100 మోటార్ సైకిళ్లు మరియు 10 ఆటో రిక్షాలను తనిఖీ చేయగా, ఎటువంటి మాదకద్రవ్యాలు, మద్యం లేదా ఇతర నిషేధిత వస్తువులు లభించలేదు. వాహనాలకు సంబంధించిన పత్రాలను కూడా పరిశీలించగా, అవి సక్రమంగా ఉన్నట్లు గుర్తించబడింది. అదేవిధంగా, ఈగల్ టీమ్‌కు కేటాయించిన డీడీకిట్ల ద్వారా 13 మంది అనుమానితులను తనిఖీ చేయగా, వారందరికీ నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు నిర్ధారించబడింది. ఈ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌లో ఎటువంటి అక్రమ మాదకద్రవ్యాలు, మద్యం లేదా ఇతర నిషేధిత వస్తువులు లభించలేదు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం మరియు నేరాల నియంత్రణలో భాగంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు మరియు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.
పలమనేరులో ఆపరేషన్ వజ్రప్రహార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 09:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)