ప్రజాశక్తి - మైదుకూరు : మైదుకూరు ప్రాంతీయ పశువైద్యశాలలో బుధవారం అటెండర్ భూమి రెడ్డి సురేష్ (48) మృతదేహంతో బంధువులు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే మృతుడు పశువైద్యశాలలో ఒప్పంద విధానంలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్నాడు. అయితే అదే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళతో గత కొంతకాలంగా చనువుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మహిళ తన పట్ల మూడు రోజుల క్రితం అసభ్యకరంగా ప్రవర్తించాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినది. దీనితో మంగళవారం ఇంచార్జి ఏడి గురివి రెడ్డి ఇరువురిని పిలిపించి విచారించారు. ఈ విచారణలో తాను తప్పు చేసినట్లు సురేష్ ఒప్పుకున్నాడు. ఇకమీదట ఎలాంటి తప్పు చేయనని ఒప్పంద పత్రం రాసి ఇవాళ్ళని అధికారులు తెలిపారు. దీనితో మనస్థాపానికి చెందిన సురేష్ ఇంటికి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య శిరీష కార్యాలయంలో పనిచేసే మహిళ వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మృతదేహానికి ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే సిబ్బంది ఎవరూ కూడా తమ ఇంటి వద్దకు, ఆసుపత్రికి కానీ మృతదేహాన్ని చూసేందుకు రాలేదని ఆగ్రహం చెందిన బంధువులు మృతదేహంతో బాధితురాలికి న్యాయం చేయాలని నిరసన తెలిపారు. ఏడిఏ సుమన్ బాధితుని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మృతదేహంతో పశువైద్యశాలలో ధర్నా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)