ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ముద్దనూరు సెయింట్ జేవియర్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్ విద్యార్థి అగ్రహారం సందీప్ విక్టర్ ఖోఖోలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీల్లో సందీప్ విక్టర్ (ముద్దనూరు) అండర్ -14 విభాగంలో ఖోఖోలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు హెచ్ ఎమ్ అమల తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సందీప్ విక్టర్ హెచ్,ఎమ్,సిస్టర్లు ప్రమీల,ఆరోగ్య,ఉపాద్యాయులు అభినందించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు.
సెయింట్ జేవియర్స్ స్కూల్ విద్యార్థి ఖోఖో లో రాష్ట్ర స్థాయికి ఎంపిక
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)