ప్రజాశక్తి - వేంపల్లె (కడప) : వేంపల్లెలో జరిగే ప్రధాన రహదారి పెండింగ్ రోడ్డు పనులను ప్రజలకు ఇబ్బందులు లేకుండా సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం వేంపల్లెలో జరుగుతున్న కడప రహదారి పనులను పులివెందుల ఇన్ ఛార్జ్ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, మండల ఇన్ చార్జ్ రఘునాథ్ రెడ్డి లతో కలిసి పనులను పరిశీలించారు. అలాగే రోడ్డు పురోగతిపై రోడ్డు భవనాల శాఖ అధికారులతో చర్చించారు. మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డిలు వేంపల్లెకు విచ్చేయడంతో టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, పట్టణ అధ్యక్షుడు నామా వేమకుమార్, టిడిపి మహిళా నేత రజీయా, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మా, సుమన్, జనసేనా నేతలు కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి దృష్టికి వేంపల్లె పట్టణంలోని గండి రోడ్డు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహమ్మద్ షబ్బీర్ తో పాటు రామమునిరెడ్డి, సుష్మాలు తెలిపారు. గతం ప్రభుత్వంలో గండి రోడ్డు మంజూరు అయినప్పటికి రద్దు చేయడం జరిగిందని చెప్పారు. అండర్ డ్రెయినేజీ, రోడ్లు విస్తరణ కారణంగా రోడ్లలన్నీ పగుల కొట్టడంతో వేంపల్లె అస్తవ్యస్తంగా మారి పోయిందని తెలిపారు. కడప రోడ్డులో ఎత్తు పెరగడం వలన వర్షా కాలంలో గండి రోడ్డులో వర్షపు నీళ్లు నిలిచే ప్రమాదముందని తెలిపారు. రాయసీమలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ గండి వీరాంజనేయస్వామి స్వామి ఆలయానికి, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి కూడ వేంపల్లె నుండే వెళ్లాల్సి ఉందని తెలిపారు.ప్రతి రోజూ వెళ్లుతుంటాయాని అయితే వాహనాల్లో వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. డ్రెయినేజీ వ్యవస్థ కూడ సరిగా లేదన్నారు. గండి రోడ్డులో రహదారి పనులు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న డ్రెయినేజీ పనులు కూడ పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని పలువురు ప్రజలు, నాయకులు కోరారు. వేంపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులు నిలిచి పోయాయాని పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ 3 కోట్లు నిధులు మంజూరు చేయించాలని టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి మంత్రిని కోరారు. దీంతో స్పందించిన మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ గండి రోడ్డులో కూడ రహదారి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి నినేదికలను పంపాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ డ్రెయినేజీ పనులు కూడ పూర్తి చేసి గండి రోడ్డు పనులు కూడ తప్పకుండా చేసి ప్రజల ఇబ్బందులను తొలగించడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే పరిష్కార మార్గం దిశగా కృషి చేస్తామని తెలిపారు. రహదారి పనులు కూడ నాణ్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల నాణ్యతలో అధికారులు రాజీ పడవద్దని తెలిపారు. పాత గండి రోడ్డులో సిమెంట్ రోడ్డు వేయాలని మంత్రికి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ వినతి పత్రం అందజేశారు. అలాగే పులివెందుల రోడ్డులోని గురుమూర్తి తోట వీధిలో సిమెంట్ రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులైన శంకర్, యోగిశ్వరబాబు లు మంత్రికి వినతి పత్రం అందజేశారు. సిమెంట్ రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకొంటామని మంత్రి హమీ ఇచ్చారు. ఈయన వెంట పులివెందుల ఇన్ ఛార్జ్ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, మండల ఇన్ చార్జ్ రఘునాథ్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ అధికారులు, టిడిపి నేతలు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేస్తాం : మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 01:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)