మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్‌ (యూజీ) తెలంగాణ అర్హుల జాబితా విడుదల

01 ఆగస్టు, 2026

NEET (UG) Telangana list of eligible candidates released.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 04:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : నీట్‌ యూజీ 2026లో అర్హత సాధించిన తెలంగాణ విద్యార్థుల జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. కటాఫ్‌ పర్సంటైల్‌, కటాఫ్‌ స్కోరుతో పాటు నీట్‌ పరీక్ష రాసిన విద్యార్థుల పేరు, కేటగిరీ, ర్యాంకు, నీట్‌ యూజీ స్కోరు తదితర వివరాలతో ప్రత్యేక జాబితాను తన అధికారిక వెబ్‌సైట్‌లో https://www.knruhs.telangana.gov.in/ అందుబాటులో ఉంచింది. తాము విడుదల చేసిన ఈ జాబితా అభ్యర్థులు, తల్లిదండ్రులకు కేవలం సమాచారం కోసమేనని, దీనిని మెరిట్‌ జాబితాగా పరిగణించకూడదని కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకొనే ముందు విద్యార్థులు వర్సిటీ విడుదల చేసే నోటిఫికేషన్‌, ప్రాస్పెక్టస్‌ను జాగ్రత్తగా చదవాలని విజ్ఞప్తి చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్