బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రైల్వేలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు..

22 జులై, 2026

Rites
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 09:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆగస్టు 17 వరకు దరఖాస్తులకు ఆహ్వానం

న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 32 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి రూ.40,000–1,40,000 వేతన శ్రేణి వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, టెక్నికల్/ప్రొఫిషియెన్సీ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఆగస్టు 17, 2026. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం రైట్స్ http://www.rites.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్