మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Recruitment - తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తు తేదీలు

01 ఆగస్టు, 2026

Online application dates for Telangana Police jobs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 01:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి పోలీసు, SPF,అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్ డేట్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను వెల్లడించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీ ఉదయం 8 గంటల నుండి సెప్టెంబర్ 9 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో దరఖాస్తులు చేసుకోవచ్చని బోర్డు చైర్మన్ వి. వి. శ్రీనివాసరావు IPS తెలిపారు. దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని ఇతర రూపాల్లో వచ్చే దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.


ఇటీవలే నోటిఫికేషన్ రిలీజ్ ....

పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి సంబంధించిన మొత్తం నాలుగు నోటిఫికేషన్లను TSLPRB గత నెల 29వ తేదీన విడుదల చేసింది. అయితే దరఖాస్తుల ప్రారంభానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో తాజాగా దరఖాస్తుల తేదీలను ప్రకటించింది.


వన్ టైమ్ ఫీజు ....

పరీక్ష రుసుముకు సంబంధించి, మొత్తం నియామక ప్రక్రియ ముగిసే వరకు (దరఖాస్తు రుసుము, ప్రాథమిక రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్/ఎఫిషియెన్సీ టెస్టులు, తుది రాత పరీక్ష మరియు బయోమెట్రిక్స్ వంటి అన్ని దశలకు) అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ఈ 'వన్-టైమ్ ఫీజు' చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సై, సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయి పోస్టులు (సివిల్, ఏఆర్, టీజీఎస్పీ, సార్సిపిఎల్, ఎస్పీఎఫ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, ఏఎస్సై ఎఫ్‌పీబీ)లకు తెలంగాణకు చెందిన స్థానిక SC మరియు ST అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ. 750 , ఇతర అభ్యర్థులందరికీ (OC, BC మరియు ఇతరులు) రూ.1,500గా నిర్ణయించారు. అలాగే కానిస్టేబుల్, ఫైర్‌మేన్, వార్డర్, ఇతర డ్రైవర్, మెకానిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే స్థానిక SC/ST అభ్యర్థులకు రుసుము రూ.600 కాగా, ఇతర అభ్యర్థులందరికీ రూ.1,200గా నిర్ణయించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్