దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 31
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వివిధ విభాగాల్లో మొత్తం 52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 48 ఇంజినీర్, 4 జియాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి.
ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పెట్రోలియం, అప్లైడ్ పెట్రోలియం, మెకానికల్, కెమికల్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 26 సంవత్సరాలు. జియాలజిస్ట్ పోస్టులకు జియాలజీలో పీజీ లేదా పెట్రోలియం/జియాలజీలో ఎంఎస్సీ/ఎంటెక్ అర్హత ఉండాలి. ఈ పోస్టులకు గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు.
ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.
ఇంజినీర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. జియాలజిస్ట్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు వేతనం అందుతుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు జూలై 31 చివరి తేదీ.








కామెంట్‌లు (0)