తెలంగాణ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) జూన్ సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మార్కులు, స్కోర్ కార్డ్‌ను వెబ్‌సైట్ ద్వారా వేగంగా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది టెట్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43.94 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం పది సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) ఈ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.
ఈ ఏడాది జూన్ సెషన్ టెట్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,15,028 మంది (74.81 శాతం) పరీక్షకు హాజరయ్యారు. కాగా, ఈ పరీక్ష రాసిన వారిలో 23,623 మంది ఇన్-సర్వీస్ (ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న) ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే…. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే వీరి ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గింది. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులలో కేవలం 37.29 శాతం మంది మాత్రమే ఈ పరీక్షలో అర్హత సాధించారు.
టిజి టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..:
అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా ఫలితాలను చూసుకునేందుకు విద్యాశాఖ ప్రత్యేకంగా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
మొదటగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in సందర్శించాలి.
హోం పేజీలో కనిపించే 'TG TET June 2026 Results' అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఓపెన్ అయ్యే లాగిన్ పేజీలో మీ హాల్ టికెట్ నంబర్, పేపర్ వివరాలను నమోదు చేయాలి.
సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మీ టెట్ స్కోర్‌కార్డ్ (మార్కుల మెమో) స్క్రీన్‌పై కనిపిస్తుంది.
భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ రిజల్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని, ఒక ప్రింట్ అవుట్ దగ్గర ఉంచుకోవడం మంచిది.








కామెంట్‌లు (0)