ఎపి టెట్- 2026 కరెంట్ అఫైర్స్
డిఎస్సీ ( DSC) మెరిట్ జాబితాలో టెట్ ( TET) స్కోరుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు సాధించిన టెట్ మార్కులను 150 (మొత్తం మార్కులు)తో భాగించి, వచ్చిన ఫలితాన్ని 20తో గుణిస్తే టెట్ వెయిటేజీ మార్కులు వస్తాయి. మిగిలిన 80 శాతం మార్కులను డిఎస్సీ రాత పరీక్ష ఆధారంగా లెక్కిస్తారు. ఉపాధ్యాయ కొలువులు ఆశిస్తున్న ఆశావాహ ఉపాధ్యాయులకు Andhra Pradesh Teacher Eligibility Test (AP TET), June 2026 ఎంతో కీలకమైంది.
1. నీట్ (NEET) పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి (జూలై 25, 2026న) రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? : ధర్మేంద్ర ప్రధాన్_
2. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని ఏ ప్రాచీన బౌద్ధ క్షేత్రం (జూలై 25, 2026న) యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం సంపాదించుకుంది? : సారనాథ్
3.హరియాణాలోని ఏ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన రైలు ప్రారంభమైంది? : జింద్
4.అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థ రూపొందించిన భారీ రాకెట్ 'స్టార్‌షిప్' ఎన్నోసారి విజయవంతంగా నింగిలోకి పయనమైంది? : 13వ సారి
5.ఇటీవల వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఎన్ని కీలక ఒప్పందాలు కుదిరాయి? : 13
6. లడఖ్ వేదికగా ఇటీవల జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది ఎవరు ?
: హర్యానా
7. కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఫీఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో విజేత ఎవరు?
: స్పెయిన్
8.కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎన్నోసారి ప్రవేశపెట్టారు?
: తొమ్మిదోసారి
9.ప్రస్తుతం ఎంత మొత్తం వార్షిక ఆదాయంపై పూర్తి పన్ను రాయితీ కల్పించారు? : రూ. 12.75 లక్షల వరకు
10.కేంద్ర బడ్జెట్ 2026-27 మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత? : రూ. 53,47,315 కోట్లు.
11. బ్రిక్స్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో ఇటీవల చేరిన దేశం (2026, జూన్ 5) : ఉజ్బెకిస్థాన్
12.న్యాయ రంగంలో సహకారానికి భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? : రష్యా
13.మన దేశంలో కొత్త ఆన్‌లైన్ గేమింగ్ నిబంధనలు ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి? : 2026, మే 1
14.యూరప్‌లోనే మొదటి పూర్తిస్థాయి సమికృత లిథియం ప్రాజెక్ట్‌ను ఇటీవలే ఏ దేశంలోని కోక్కోలాలో ప్రారంభించారు? : ఫిన్లాండ్
15. నాబార్డు ఛైర్మన్ పేరు? : షాజీ కె.వి
16.యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) డైరెక్టర్ జనరల్ పేరేమిటి?
: అలెగ్జాండర్ డిక్రూ
16.ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) మేనేజింగ్ డైరెక్టర్ పేరు?
: క్రిస్టలీనా జార్జియెవా
17.యునెస్కో డైరెక్టర్ జనరల్ పేరేమిటి?
: అమదౌ మహతార్
18.ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (FAO) డైరెక్టర్ జనరల్
: డా. క్యూ డాంగ్యు
19.ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పేరు?
: ఆంటోనియో గుటెరస్
20.ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ఛైర్మన్ పేరు?
: జై షా
21.కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ పేరు?
: షిర్లీ అయోర్కోర్ బోచ్వే
22.ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రెసిడెంట్ పేరు? : ఇవాసవా యుజి
23.యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరు?
: కేథరీన్ రస్సెల్
24.వ్యవసాయ పంటలకు సంబంధించిన గుర్తింపును ఇచ్చే ఎఫ్‌ఎస్‌ఏ పూర్తి పేరు? : ఫార్మ్ సస్టైయినబిలిటీ అసెస్‌మెంట్
25. 2026, ఏప్రిల్ 9 నుంచి 17 వరకు భారత్, ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసాలను ఎక్కడ, ఏ పేరుతో నిర్వహించారు?
: ‘సైక్లోన్-ఖిజు’ పేరుతో, ఈజిప్ట్‌లోని అన్షాస్‌లో
26.ఇటీవల మనదేశం ఏ దేశానికి మూడువేల టన్నుల వైద్య సామగ్రి, 20 వేల డోసుల తట్టు వ్యాక్సిన్లను అందజేసింది? : మాల్దీవులు
27.సోషల్ మీడియా వల్ల పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టేందుకు ఏ దేశం పార్లమెంటులో నైఫ్ సోషల్ మీడియా యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టింది? : కెనడా
28.ప్రపంచ వేదికపై భారతీయ నేతవస్త్రాలను ప్రోత్సహించడానికి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ (కేంద్ర జౌళీ మంత్రిత్వశాఖ) ఇటీవల భువనేశ్వర్‌లో నిర్వహించిన కార్యక్రమం పేరు?
: ‘విశ్వసూత్ర యూవ్స్ ఆఫ్ ఇండియా, ఫర్ ది వరల్డ్’
29. సోషల్ మీడియా వాడకానికి కనీస వయోపరిమితిని 15 సంవత్సరాలుగా ఇటీవల ఏ దేశం నిర్ణయించింది?
: యూఏఈ
30. 2026, ఏప్రిల్ 13 నుంచి 25 వరకు ఏ రెండు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలను ‘ఎక్సర్‌సైజ్ డస్ట్‌లిక్’ పేరుతో నిర్వహించారు? : భారత్ - ఉజ్బెకిస్థాన్
31.జాంగ్మి తుపాను ఇటీవల ఏ దేశంలో తీవ్రమైన ప్రభావం చూపింది? : జపాన్
32. ఇటీవల విస్ఫోటం చెందిన ‘మౌంట్ మెరాపి’ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? : ఇండోనేసియా
33.ఇటీవల వార్తల్లో నిలిచిన బ్యూఫోర్ట్ కోట (ఖలాత్ అల్-షకీఫ్) ఏ దేశంలో ఉంది?
: ఇజ్రాయెల్ ఈ కోటను ఇటీవల స్వాధీనం చేసుకుంది.
34.గ్లోబల్ ఏఐ బ్రెయిన్ రేస్ రిపోర్ట్ 2026లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? : అమెరికా.
35. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లే భారత్‌కు చెందిన ఇంధన రవాణా నౌకలను సురక్షితంగా కాపాడటానికి భారత నౌకాదళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు? : ఆపరేషన్ ఊర్జా సురక్ష
36.భారత్ - ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
: 2026, జూన్ 1
37. ఇటీవల 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి సోషల్ మీడియాను నిషేధించిన దేశం? : మలేసియా
38.అమెరికా నేతృత్వంలోని పాక్స్ సిలికా వ్యూహాత్మక కార్యక్రమంలో ఇటీవల ఏ ఆసియా దేశం 13వ సభ్యదేశంగా చేరింది? : ఫిలిప్పీన్స్
39. సార్క్ ఫ్రేమ్‌వర్క్ కింద ఏ సార్క్ దేశానికి భారత్ 30 బిలియన్ రూపాయల కరెన్సీ మార్పిడి సదుపాయాన్ని కల్పించింది? : మాల్దీవులు
40.భారత్ నుంచి దిగుమతయ్యే సోలార్‌సెల్ ప్యానెళ్లపై 123 శాతానికిపైగా ప్రాథమిక యాంటీ - డంపింగ్ సుంకాన్ని ఇటీవల ఏ దేశం విధించింది? (అమెరికాలో భారతీయ ఉత్పత్తులను సరసమైన మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు అమ్ముతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 123 శాతానికిపైగా సుంకాన్ని విధించారు.) : అమెరికా
41.ఇటీవల భారతీయ మామిడి పండ్ల మీద నిషేధం విధించిన దేశం? : జపాన్
42.2026, మే 1 నుంచి ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్), ఒపెక్ ప్లస్ నుంచి ఏ దేశం వైదొలగింది? (ఒపెక్‌ను 1960లో స్థాపించారు. 1967లో ఒపెక్‌లో యూఏఈ చేరింది.)
: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
43. ఏ దేశానికి చెందిన రెండు కాళ్లు లేని పర్వతారోహకుడు రుస్తమ్ నబీవ్, కేవలం తన చేతులతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు? : రష్యా
44.2027ను ‘సంస్కృతి, పర్యాటక సంవత్సరం’గా ఏ దేశాలు ప్రకటించాయి? : ఇటలీ - ఇండియా
45.ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏయే దేశాల్లో ‘అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది?
: ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
46.2026, ఏప్రిల్ 3న మిన్ ఆంగ్ హ్లైంగ్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? : మయన్మార్
• 2026, ఏప్రిల్‌లో ఏ అంతర్జాతీయ సంస్థకు చెందిన నాలుగు కీలక ఎన్నికల్లో భారత్ ఏకగ్రీవంగా విజయాలు సాధించింది?
: ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి - ECOSOC
47. 2026, ఏప్రిల్ 27న భారత్ ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు చేసింది?
: న్యూజిలాండ్
48.ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30.37 శాతం వాటాతో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? : భారత్
49. 2026, జూన్‌లో లిపులేఖ్ కనుమ ద్వారా ఏ దేశంతో సరిహద్దు వాణిజ్యాన్ని _పునఃప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? (2020లో కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ వాణిజ్య మార్గాన్ని మూసివేశారు.) : చైనా
50.అమెరికా, ఏ దేశం మధ్య బాలికాటన్ 2026 సైనిక విన్యాసాలు జరిగాయి? : ఫిలిప్పీన్స్51.
51.అంకాలో అని పిలిచే ప్రపంచంలోనే మొదటి శాశ్వత భూగర్భ అణువ్యర్థాల నిల్వ కేంద్రం నిర్మాణం, నిర్వహణను ఏ దేశం ప్రారంభించింది? : ఫిన్లాండ్
52. ఇటీవల ఇండియా, ఏ దేశం మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది? : న్యూజిలాండ్
53.2026, ఏప్రిల్ 18న కర్ణాటకలోని బన్నేర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్‌కు ఏ దేశం నుంచి నాలుగు చిరుతలు (రెండు మగ, రెండు ఆడ) వచ్చాయి? : దక్షిణాఫ్రికా
54.ఇటీవల ‘ఒపెక్’ నుంచి ఏ దేశం వైదొలిగింది?
: యూఏఈ
55.ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీకి ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్స్ అవార్డు ప్రకటించిన దేశం? : నెదర్లాండ్స్
56. ఏ ఆఫ్రికా దేశంలో ఇటీవల మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు? : ఈజిప్టు
57.ఏ దేశానికి ఇండియా 13 టన్నుల బీసీజీ వ్యాక్సిన్‌ను సరఫరా చేసింది? : అఫ్గానిస్థాన్
58.అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇటీవల భారత్‌తో ఏ దేశం ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? : నేపాల్
59. ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు ‘ధర్మ గార్డియన్’ 7వ ఎడిషన్‌ను 2026, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు ఉత్తరాఖండ్‌లోని చౌబట్టియాలో నిర్వహించారు?
: భారత్ - జపాన్
60.ఉచరల్ న్యామ్ ఓసోర్ (Uchral Nyam Osor) ఏ దేశ నూతన ప్రధానిగా నియమితులయ్యారు? : మంగోలియా
61.ప్రపంచంలోనే అత్యంత బరువున్న కార్గోడ్రోన్ ‘చాంగింగ్-8’ను ఆవిష్కరించిన దేశం? : చైనా
62.ఏ దేశంలో ప్రధాన, అత్యంత ఆధిపత్య సైనిక సమూహం హిజ్బుల్లా (అరబిక్‌లో ‘దేవుడి పక్షం’) ఉంది?
: లెబనాన్
63.ఎఫ్-35, ఎఫ్-15 యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవి? : అమెరికా
64.సుదూర వైమానిక దాడులు, నిఘా సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత వైమానిక దళం (ఐఏఎఫ్) భారతదేశపు మొదటి హెలికాఫ్టర్ - లాంచ్డ్ మానవరహిత వైమానిక వ్యవస్థ అయిన దేన్ని ప్రారంభించింది?
: వాయు బాన్
65. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ - 2026లో 8.574 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచిన దేశం? : పాకిస్థాన్
66. ఏ దేశానికి చెందిన మొదటి ట్రాన్స్‌జెండర్ మహిళా ఎంపీగా భూమిక శ్రేష్ఠ నిలిచారు? : నేపాల్
67.వైర్లు లేకుండా గాలిలో విద్యుత్తును పంపి ఏ దేశ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు? : ఫిన్లాండ్
68. ఇటీవల వార్తల్లో ఉన్న ‘ఖర్గ్ ఐలాండ్’ ఏ దేశానికి చెందింది? : ఇరాన్
69. ‘ఫ్రీడం షీల్డ్’ అనే సంయుక్త సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి?
: అమెరికా, దక్షిణ కొరియా
70.ప్రపంచవ్యాప్తంగా శాంతి, సహనం, అహింస, మతాల మధ్య అవగాహనను ప్రోత్సహించడానికి ప్రపంచ మత సామరస్య వారాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? (ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.)
: ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు
- కె.ఎస్. లక్ష్మణరావు
జనవిజ్ఞాన వేదిక
రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు, సెల్ : 8309965083








కామెంట్‌లు (0)