మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కల్పనను నిజం చేసే కృష్ణ కథ!

10 గంటల క్రితం

కల్పనను నిజం చేసే కృష్ణ కథ! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు దుల్కర్‌ సల్మాన్‌ మరో ఆసక్తికర చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో పవన్‌ సాదినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతున్నారు. శ్రుతి హాసన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. వ్యోమగామి కావాలనే కలతో జీవించే ఓ పల్లెటూరి అమ్మాయి ప్రయాణమే ఈ కథాంశంగా కనిపిస్తోంది. ఆమె కలను నిజం చేసేందుకు కృష్ణగా దుల్కర్‌ సల్మాన్‌ ఎలాంటి తోడ్పాటునందించారన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉండనుంది. గ్రామీణ నేపథ్యం, అమ్మాయి ఆశయం, ఆమె కలకు అండగా నిలిచే వ్యక్తి చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్‌ సూచిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్