ముంబయి : ముంబైలో జరిగిన సిఇసి వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ ను ఈ మేరకు దేశం విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు ఆదేశించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు, స్వయంగా నటుడు కూడా అయిన ఇమ్రాన్ ఖాన్ స్వతహాగా అమెరికా పౌరుడు. ఈ నెల 10వ తేదీన ముంబైలో జరిగిన సిఇసి వ్యతిరేక నిరసనల్లో ఇమ్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి, ఆ తరువాత విడిచి పెట్టారు. సిఇసి రాజీనామాను డిమాండ్ చేస్తూ .... అక్టోబర్ 10 న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్లో జరిగిన ఆందోళనలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు ఆయన భాగస్వామి, సినీనటి లేఖా వాషింగ్టన్, ఆయన బంధువు జైన్ మేరీ ఖాన్ కూడా ఉన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనిన కారణంగా ముంబై పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇమ్రాన్ భారత పౌరుడు కానప్పటికీ నిరసనలో పాల్గొన్నారనే ఆరోపణలపై, ఇమ్మిగ్రేషన్ చట్టంలోని నిబంధనల కింద ఆయనపై చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 28 కల్లా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు పోలీసుల చర్యలకు ముందే బిజెపి నేత కిరీట్ సోమయ్.. ఇమ్రాన్ను దేశం నుండి బహిష్కరించాలని ముంబై పోలీసులను కోరడం విశేషం..! ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని పేర్కొంటూ ... అతనిని దేశం నుండి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పౌరసత్వాన్ని ధ్రువీకరించాలంటూ ... సోమయ్ ముంబై పోలీసులను కోరారు. ఒక విదేశీయుడు రాజకీయ ఆందోళనలో పాల్గొనడం సరైనదేనా అని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నిరసనల్లో పాల్గొన్న హీరో ఇమ్రాన్ ఖాన్ కు దేశ బహిష్కరణ నోటీసులు ..!
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 11:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)