మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండస్ట్రీలో అమ్మాయిల పట్ల వివక్ష : ఇంద్రజ

04 ఆగస్టు, 2026

MV5BNTJjOTZmMWEtZWY3NC00MTJmLThiZWUtZjViZGE1NmI1MDYyXkEyXkFqcGcV1FMjpgUX1000-1785852045165-7313.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సినీ పరిశ్రమలో మహిళా నటీనటులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రముఖ నటి ఇంద్రజ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’ ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడుతూ మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించారు. ‘మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు దక్కుతున్నంత ప్రాధాన్యం ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు దక్కడం లేదు. ఇతర భాషల్లో మహిళలకు ప్రాధాన్యమున్న మంచి పాత్రలు వస్తున్నాయి. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి పాత్రలు ఎందుకు రావడం లేదు? ఈ విషయంపై రచయితలు, దర్శకులు ఆలోచించాలి. మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులకు న్యాయం జరగాలి’ అని ఆమె అన్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనకాపల్లి’ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్