మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు..

7 గంటల క్రితం

బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు.. 
- అమితాబ్ బచ్చన్‌కు బెదిరింపులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 10:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అమితాబ్ బచ్చన్‌కు బెదిరింపులు

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లను బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడలేదంటూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ బెదిరించాడు. తన అనుచరుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినా అమితాబ్‌‌పై దాడి ఆగదని హెచ్చరిస్తూ సోషల్‌ ‌మీడియాలో పోస్టు చేశారు. ముంబైలో తనకు చెందిన 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారంటూ రెచ్చిపోయాడు. సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని వదిలిపెట్టబోనని, అమితాబ్, అభిషేక్‌కు ఎంత భద్రత ఉన్నా, బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేసుకున్నా కాల్చి చంపుతామని బెదిరించాడు. అయితే, కొద్దిరోజుల క్రితం ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద కాల్పులు జరిపేందుకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కుట్రలో వీరి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టైన వారిలో వికాస్ ఠాకూర్ అలియాస్ విక్కీ, దీపక్ సింగ్ అలియాస్ దీప్ ఉన్నారు. వీరిద్దరూ పంజాబ్‌లోని జలంధర్, తరన్ తరన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అమితాబ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్