ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'ప్రభుత్వాలు మారినా వారి కష్టాలు మాత్రం మారడం లేదు` : హీరో కార్తీ

1 గంట క్రితం

"Even though governments change, their hardships remain the same" – Actor Karthi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు : ' ప్రభుత్వాలు మారినా పోలీసుల కష్టాలు మాత్రం మారడం లేదు ` అని తమిళనాట అధికారంలో ఉన్న విజయ్ సర్కార్‌ పై తమిళ స్టార్ హీరో కార్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోయంబత్తూరులో ఘనంగా నిర్వహించిన మాజీ పోలీసు అధికారుల పబ్లిక్ వెల్ఫేర్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో హీరో కార్తీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టివికె ప్రభుత్వం పోలీసుల సంక్షేమం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిందన్నారు. విధుల్లో ఉన్న పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు (వీక్లీ ఆఫ్) ఇస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. అది క్షేత్రస్థాయిలో అమలు కాకుండా కేవలం కాగితాలకే పరిమితమైందని ఆరోపించారు. గతంలో ఉన్న డిఎంకె ప్రభుత్వం కూడా ఇలాగే హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినా పోలీసుల కష్టాలు మాత్రం మారడం లేదన్నారు. స్వయంగా సిబ్బందే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని కార్తీ చెప్పారు. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం వల్ల పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని కార్తీ అభిప్రాయపడ్డారు. సమాజంలో ఏ చిన్న నేరం జరిగినా గంటల వ్యవధిలోనే దాన్ని ఛేదించాలని ప్రజలు ఆశిస్తున్నారని, దీనివల్ల పోలీసు సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో పోలీసులపై కొన్నిసార్లు విమర్శలు రావచ్చునని, కానీ ఇప్పటికీ ఎంతోమంది నిజాయితీపరులైన అధికారులు ఉన్నందువల్లే ప్రజలందరూ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని ప్రశంసించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్