బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హీరో నాని స్పెషల్ రిక్వెస్ట్ .. సిఎం రేవంత్‌ రెడ్డి రిప్లై

1 గంట క్రితం

Hero Nani's special request... CM Revanth Reddy's reply.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : టాలీవుడ్ హీరో నాని విజ్ఞప్తి పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న థియేటర్‌లో అభిమానులతో కలిసి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీమియర్ షో చూసేందుకు అనుమతి ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నాని రిక్వెస్ట్‌ చేసిన సంగతి విదితమే. దీనిపై సిఎం ఎక్స్‌ వేదికగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను పాటించడంపై నానికి ఉన్న నిబద్ధతను అభినందించారు. “భద్రతా మార్గదర్శకాల పట్ల మీరు చూపిస్తున్న గౌరవానికి, అలాగే తెలంగాణకు చెందిన ప్రతిభావంతులైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పట్ల మీకున్న అంకితభావానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. జనసందోహాన్ని సజావుగా నిర్వహించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి, దయచేసి సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారిక దరఖాస్తును సమర్పించండి. సంబంధిత బృందం ఆ దరఖాస్తును పరిశీలించి, తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది” అంటూ రిప్లై ఇచ్చారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ మూవీ ది ప్యారడైజ్. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 23న రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలకు ఏర్పాటు జరుగుతున్న సమయంలోనే అభిమానులతో కలిసి తాను సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిఎం రేవంత్ రెడ్డిని నాని రిక్వస్ట్ చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్